బ్యాంకులు,జీవిత భీమా సంస్థలను ప్రైవేటికరణ చేయటాన్ని విరమించుకోవాలి.

అనకాపల్లి :  కేంద్ర భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపుమేరకు,ఈ నెల 24 నుండి 30 వ తారీకు వరకు,జరిగే సర్కారు జాగో కార్యక్రమంలో భాగంగా,దేశములో గల  బ్యాంకులు, జీవిత భీమా వంటి సంస్థలను ప్రైవేటికరణ చేయటాన్ని వ్యతిరేకంగా స్థానిక మహారాష్ట్ర బ్యాంకు ఆవరణలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.వీరి డిమాండ్లు క్రింది విధంగా ఉన్నాయి 1. బ్యాంక్ ఉద్యోగుల11వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని,2.వారానికి 5 రోజులు పని దినాలు అమలు చేయాలని,3.కుటుంబానికి ఇచ్చే పెన్సన్ పెంచాలని,4.కార్మిక చట్టాలలో మార్పులు చేయడం మానుకోవాలని.విశ్రాంత ఉద్యోగుల పెన్సన్ ను ,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విదంగా బ్యాంక్ ఉద్యోగులకు అమలు చేయాలని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి స్ఫూర్తి, రాజు,మహేశ్, అప్పారావు,సంతోష్ పాల్గొన్నారు…

Latest News