బిజెపి ఆధ్వర్యంలో ఘ‌నంగా అల్లూరి వ‌ర్ధంతి

న‌ర్సీప‌ట్నం- మన్యం వీరుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వహించడం జరిగింది. స్థానిక ఆర్డిఓ ఆఫీసులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సీనియర్ నాయకులు కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ చిన్నవ‌య‌స్సులోనే దేశ విముక్తి కోసం పోరాడిన అగ్ర‌గ‌ణ్య స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజు అని అన్నారు. మన్యం ప్రజల దినస్థితి గతులు చూసి బ్రిటీష్ వారి నిరంకుశ‌ పాలనకు వ్యతిరేకంగా విప్లవం మొదలుపెట్టి తెల్లదొర్లకు సింహం గా మారి బ్రిటిష్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారని తెలిపారు.భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం మండల అధ్యక్షులు బొలెం శివ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళ తుపాకీ తూటలకు ఎదురు వెళ్లి తన 27 సంవత్సరాల యుక్త వయసులో వీరమరణం పొందారని ఇప్పుడు ఉన్న యువత అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకొని ఆయన పోరాటాలను తెలుసుకోవాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా నాయకులు అడిగర్ల సతీష్, సీనియర్ నాయకులు చిదాడ నూకేశ్వరరావు, కురచా కామేశ్వరరావు, ముమ్మిడి సత్యనారాయణ, జి.వి బ‌ధ్రం తదితరులు పాల్గొన్నారు…

Latest News