పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.
విశాఖపట్నం : దేవాలయ పర్యాటకం లో భాగంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53 కోట్లు కేంద్ర నిధులు మంజూరైనట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రసాద్ (నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్) పథకంలో సింహాచలం దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ నిధుల కొరకు లేఖ రాసిన వెంటనే స్పందించి నిధులను విడుదల చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు మంత్రి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.యస్. జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నం జిల్లా ప్రజల తరుపున కృతఙ్ఞతలు తెలిపారు…ఈ క్రింది విభాగాల్లో మౌలికసదుపాయాలు, అభివృద్ధి పనుల కోసంకేంద్ర ప్రభుత్వం రూ.53.00 కోట్లు నిధులు మంజూరు చేసింది. సింహాచలం పర్వత ప్రాంతాలకు – రూ.27,86,00,000 /- సింహాచలం కొండ పైకి – 18,21,50,000 /- పాన్ ఏరియా భాగాలు – 3,87,50,000 /- ఖర్చు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పర్యాటకం గా అభివృద్ధి చెందడం కోసం కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.