అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సమస్య వచ్చిన ప్రతిసారి శవ రాజకీయాలు చేయడం, దిగజారి మాట్లాడటం, ఆ తరువాత అభాసుపాలు కావడం అలవాటు అయ్యిందన్నారు. చంద్రబాబు వయసు పెరిగి, బుర్ర చెడిపోయి ప్రెస్టేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తిరిగి అధికారంలోకి రామనే అనుమానంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ధోరణి విడ్డురంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రధానికి లేఖ రాశారని, ఆ ధైర్యం చంద్రబాబుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. విశాఖ స్టీల్స్‌ను నిలబెట్టుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
ప్రైవేటీకరణపై కేంద్రానికి సీఎం వైయస్ జగన్ లేఖ రాశారని తెలిపారు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ ఉక్కుకు లాభం జరుగుతుందన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో సీఎం వైయస్ జగన్ సమావేశం అయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రితో కలిసిన తరువాత స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలకు భరోసా దొరికిందన్నారు.
విశాఖ వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు తప్పుపట్టారు. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ధోరణి విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు బు్రర చెడినట్టుందన్నారు. చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘‘ఎంపీ విజయసాయిరెడ్డిని పట్టుకుని ‘ఏం పీకారని చంద్రబాబు అంటున్నారు. పిచ్చి కుక్కలా తిరుగుతున్నారని, అంతు చూస్తానని, బట్టలు ఊడదీస్తానని’ అంటున్నారు. ఇంత దిగజారిపోయి చంద్రబాబు మాట్లాడటం ఏంటి? ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు దుర్భాషలాడుతున్నారు. సీనియర్ అని చెప్పుఉనే చంద్రబాబు దోరణి విడ్డూరంగా ఉంది. విశాఖ ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబుకు బుర్ర చెడినట్లుంది. బ్యాంకులు ఇచ్చిన రుణాలకు 14 శాతం వడ్డీ కట్టలేకపోవడంతో నష్టాలు వచ్చాయి. విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని సీఎం వైయస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. నీ కుమారుడి వయసు ఉన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు తన స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారు.’’ అని అన్నారు.
‘‘నీ కంటే బూతులు మాట్లాడేవారు ఎవరున్నారు. సమస్యను పరిష్కరించాలనే భావన చంద్రబాబుకు ఉండదు. శవాలు దొరికితే రాబంధులకు, నక్కలకు ఎంత ఆనందమో చంద్రబాబుకు ఏదైన సమస్య దొరికితే అంత ఆనందంగా ఉంటుంది. ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగితే సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. అదే చంద్రబాబు శవాల కోసం రాజకీయాలు చేశారు. నిన్న విశాఖ వెళ్లి వైయస్ జగన్ రాజీనామా చేస్తారా? అని అంటున్నారు. రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? సమస్యను పరిష్కరిస్తాం. పరిష్కార దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు మీద పడి బుర్ర చెడిపోయి అధికారం వస్తుందో రాదో తెలియక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ ఎంత హుందాగా విశాఖకు వెళ్లారు. కార్మిక సంఘం నేతలతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు వెళ్లి రెచ్చగొడితే ఎవరూ రెచ్చిపోలేదే. మీకు అనుకూలమైన నేతలు కూడా స్టీల్ ప్లాంట్‌లో ఉన్నారు కదా? వైయస్ జగన్ చెప్పిన మాటలతో సంతృప్తిగా ఉన్నారు. సమస్యను పరిష్కరించే నాయకుడు వైయస్ జగన్ అంతేకాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.’’ అని పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. పిచ్చెక్కి ప్రెస్టేషన్‌తో మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఈ రోజు వచ్చింది కాదు 2014లోనే తెరపైకి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు ఏమీ చేయలేదు. పోస్కో యాజమాన్యంతో సమావేశం అయితే తప్పేంటి? చంద్రబాబు పోస్కోతో కలవలేదా? పోస్కోనే కాదు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఎవరితోనైనా కలుస్తాం. సీఎం వైయస్ జగన్ తన సర్వశక్తులు ఒడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారం పోయిందని ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.’’ అని వ్యాఖ్యానించారు.