ఐదు కోట్ల ప్రజల తరఫున ప్రధానికి సీఎం లేఖ

విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వ్యతిరేకిస్తున్నామని, 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున ప్రధాని నరేంద్రమోడీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అన్నారు. ప్రభుత్వపరంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆస్తి అని, దాన్ని సాధించుకొని తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News