పిఠాపురం, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం. రామ్మోహన్‌ను ఎన్నికల విధుల నుండి తొలగిచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఎస్ఈసీకి ఓ లేఖ రాశారు. గతంలో ఎన్నికల విధులలో పలు అవకతవకలకు మున్సిపల్ కమిషనర్ పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. పిఠాపురం మున్సిపాలిటీ ఓటరు లిస్టు తయారీలో అవకతవకలు చేసి సస్పెండ్ కూడా అయ్యారని, ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే కమిషనర్ రామ్మోహన్‌ను ఎన్నికల విధుల నుండి తొలగించాలని ఎస్ఈసీని కోరారు.