న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): కోవిడ్ సవాళ్ళను తట్టుకొని భారతీయ రైల్వేలు మొత్తం 1138 పండుగలకు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు సహా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను విభిన్న జోన్లలో నడుపుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గమ్య స్థానాలు కూడా ప్రత్యేక రైళ్ళతో అనుసంధానం అయి ఉన్నాయి. మరిన్ని రైళ్ళను నడిపాల్సిన అవసరాన్ని గురించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. కోవిడ్ ముందు కాలంలో భారతీయ రైల్వేలు రోజుకు సగటున 1768 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నడుపుతోంది. జనవరిలో మొత్తం 115 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నడిపేందుకు ఆమోదించడం గమనార్హం.
దీనికి అదనంగా, ప్రస్తుతం భారతీయ రైల్వేలు రోజుకు 4807 సబర్బన్ రైలు సర్వీసులు వివిధ భారతీయ రైల్వే జోన్లలో నడుపుతోంది. కోవిడ్ ముందు సమయంలో సగటున 5881 సబర్బన్ రైళ్ళను నడిపింది. ఇవే కాకుండా, 196 పాసింజర్ రైల్ సేవలను భారతీయ రైల్వేలు నడుపుతోంది. కోవిడ్ ముందు కాలంలో దేశవ్యాప్తంగా 3634 ప్యాసింజర్ రైళ్ళు నడిచేవి.