న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): కోవిడ్ అనంతర భారతదేశాన్ని, దాని ఆర్థిక వ్యవస్థకు ఈశాన్యం నాయకత్వం వహిస్తుందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంథనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వ్యూహరచనను (లాజిస్టిక్స్) బలోపేతం చేయడంః ఈశాన్యంలో ఇ-కామర్స్‌కు ఎదురయ్యే సవాళ్ళు, అవకాశాలు అన్న అంశంపై సిఐఐ నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈశాన్యం (ఎన్ఇ) అంటే నూతన భారతదేశ ప్రగతికి నూతన ఇంజన్ అని, 2022లో మనం భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని సమీపిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానినే ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని అనుసంధానత సమస్యలను పరిష్కరాలకు ప్రధానమంత్రి ఇస్తున్న భారీ ప్రేరణ ఈ ప్రాంతాన్ని దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలపడమే కాక, రెండంకెల వృద్ధికి, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి దారి తీస్తుందన్నారు. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఒకటి కన్నా ఎక్కువ మార్గాలలో ప్రోత్సహించేందుకు ఇ-కామర్స్ సరఫరా లంకె అత్యంత ఆశాజనక అంశాలలో ఒకటని, మహమ్మారి కాలం మధ్యస్థాయి పరిశ్రమలు, చిన్న వ్యాపారుల జీవనోపాధులను ఇ-కామర్స్ ఎలా పెంచిందో చూపిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రతిభకలిగిన చేతివృత్తిపని వారు, శిల్పులు, నైపుణ్యం కలిగిన పనివారు వేల, లక్షల సంఖ్యలో ఉన్న క్రమంలో ఇ-కామర్స్ వారికి వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు బలమైన వేదికను కల్పించడమే కాక, అంతర్జాతీయ మార్కెట్‌లో వారి ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశాన్ని సృష్టిస్తుందన్నారు. వ్యూహరచనను, వ్యాపార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఈ ప్రాంతంలో శక్తిమంతమైన బహుళ నమూనా రవాణా రంగాన్ని సృష్టించాలన్న దృష్టితో ప్రభుత్వం దశలవారీ అభివృద్ధి వ్యూహాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నిర్ధిష్ట రంగ విధాన చొరవను ప్రారంభించిందని మంత్రి చెప్పారు. పెరుగుతున్న గమ్యస్థానంగా ఈ ప్రాంత సామర్ధ్యాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈశాన్య ప్రాంతంలో కార్యాచరణ జాడను వేగంగా వ్యాప్తి చేసేందుకు భారతీయ సరఫరా చైన్ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్ధవంతమైన నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతంలోని నిక్షిప్తంగా ఉన్న భారీ సామర్ధ్యాన్ని అనుకూలపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీగా రూపాంతరం చెందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పెరుగుతున్న ఆగ్నేయ ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రవేశద్వారంగా, వ్యాపారాన్ని ఆసియన్ దేశాలతో వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడం ద్వారా ఈశాన్య ప్రాంతం దేశ జిడిపికి భారీగా దోహదం చేసే సామర్ధ్యం ఉందని, తద్వారా కోల్పోయిన ఆర్థిక ప్రాముఖ్యతను తిరిగి పొందుతుందని ఆయన వివరించారు.