గ్రీవియన్స్ కు అనూహ్యస్పందన ఆర్డీవో కార్యాలయంలో పోటెత్తిన ప్రజానీకం.

స్పంద‌నలో తీసుకున్న అర్జీల ఈ నెల 25వ తేదీ లోపల పరిష్కారం చేయాలి.- జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున…

నర్సీపట్నం-కోస్తాటైమ్స్ 11: నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి చుట్టుప్రక్కల మండలాలు,గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం నుండే సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ డా.ఏ మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ ఎం వేణు గోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ కల్పనా కుమారి, ఆర్డీవో ఆర్.గోవిందరావులు స్పందనలో పాల్గొని ప్రజల సమస్యలను ఆలకించి వారి వినతులను స్వీకరించారు.సోమవారం నర్సీపట్నం డివిజన్ పరిధిలో జరిగిన స్పందన కార్యక్రమంలో 695 అర్జీలను స్వీకరించారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వారి అర్జీలను పరిశీలించి ఈ నెల 25 తేదీ లోపుగా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో గల ప్రజల సమస్యలను తెల్సుకొని సత్వరంగా పరిష్కరించేందుకు జిల్లాలో ప్రతీ డివిజన్ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు.ఈ విధంగా అన్ని డివిజన్ లలో ఒక్కొక్క వారం స్పందన నిర్వహించి ప్రజల సమస్యలను,అర్జీలను తీసుకోవడం జరుగుతుందన్నారు. స్పందన కార్యక్రమంలో అధికంగా భూ సంబంధిత,హౌసింగ్, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు…

 

Latest News