దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ.

పరవాడ,కోస్తాటైమ్స్ : కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎంప్లాయిస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లిజిల్లా పరవాడ భవిత కేంద్రంలో గల 16 మంది దివ్యాంగులకు భాగంగా వీల్ చైర్లు, ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు, రోలేటర్స్, మరియు భవిత కేంద్రానికి మెగాఫోన్ మరియు స్పీకర్స్ అందజేసారు. సామాజిక భాధ్యతలో భాగంగా దివ్యాంగులకు ఈ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కోరమండల్ యూనియన్ ప్రెసిడెంట్ భూపతిరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష సహిత విద్య సమన్వయకర్త సంతోష్ కుమార్,కోరమండల్ యూనియన్ సభ్యులు,భవిత ఉపాధ్యాయులు,దివ్యాంగులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు…

Latest News