తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): బొగ్గులకుంట తిలక్ రోడ్ ఎండోమెంట్ (బ్రాహ్మణ పరిషత్) ఆఫీస్ వద్ద ఇవాళ వివిధ రంగాల్లో నైపుణ్యం ఉండి ఆర్థికంగా స్థోమత లేని వారిని ప్రోత్సహించే కార్యక్రమాంలో భాగంగా బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీమ్ కింద లబ్ధిదారులు కొదురుపాక గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లాకి చెందిన కొండపాక రంగాచార్యకి స్వయం ఉపాధిలో భాగంగా హోండా అమేజ్ కారును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పేద బ్రాహ్మణులను ఆర్ధికంగా ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు తమకు మార్గనిర్దేశం చేశారన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుచేసి ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల గురించి, వారి అభ్యున్నతి కోసం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే భావనతో ప్రత్యేకంగా నిధులను కేటాయించారని, ఆ నిధులతో వివిధ రకాల కుటీర పరిశ్రమలు, పేద బ్రాహ్మణుల పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి దోహదపడే విధంగా ఒక్కో
విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అదే విధంగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నామని, వేద పాఠశాలల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని పాత జిల్లా కేంద్రాలలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్ల కోసం వెయ్యి గజాల స్థలం సంఘాలవారు లేదా వ్యక్తులు సమకూరిస్తే 80 లక్షలు వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, అదేవిధంగా వృద్ద వేద/స్మార్త పండితులకు ప్రతి నెల మూడు వేల పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు కొండపాక రంగాచార్య మాట్లాడుతూ వివిద రంగాలలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా స్థోమత లేని వారికి, నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశమని, తనకు లభించిన చక్కటి అవకాశమని దీనికి కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమార్, బ్రాహ్మణ నాయకులు
విన్నకోట రాజ్ కుమార్, మోత్కూరి సాయి శ్రవన్, ఆరుట్ల కరుణాకరాచార్యులు, సంక్షేమ పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వాహనం ఖరీదు (టోటల్ యూనిట్ కాస్ట్) 8.17 లక్షలు కాగా, అందులో (ప్రభుత్వ పరిషత్ తరుపున 4.82 లక్షలు సబ్సీడీ) ఇచ్చింది.

Latest News