హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): విపత్కర పరిస్థితుల్లోనూ నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని అటవీ శాఖ ప్రోత్సహిస్తుందని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం నుంచి జిల్లాకు ఆరుగురు చొప్పున బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు నగదు ప్రోత్సాహంతో కూడిన అవార్డులను అందిస్తున్నామని వెల్లడించారు.
అరణ్య భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సిబ్బందితో కలిసి పీసీసీఎఫ్ పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలోనూ అటవీ శాఖ సిబ్బంది అందరూ బాగా పనిచేశారని అభినందించారు. వివిధ సెక్షన్లలో మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో అరణ్య భవన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.