నర్సీపట్నం : నాటుసారా తయారు చేయు మరియు రవాణా చేయు గ్రామాలను గుర్తించి వాటిపై నిఘా పెట్టి పూర్తిగా నాటుసారాయి నిర్మూలనకు కృషి చేయాలని నర్సీపట్నంలో ఎఎస్పీ ఆఫీసులో గల గెస్ట్‌హౌస్‌లో రాహుల్ దేవ్ సింగ్ ఐపిఎస్ అడిసినల్ ఎస్పీ,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఇబి) ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడినప్పటి నుండి ఈరోజు వరకు గల పెట్టిన కేసులను మండలాల వారీగా తెలుసుకోవడం జరిగినది. వారంలో ఒకరోజు ఏదైనా గ్రామంలో రెవెన్యూ మరియు పోలీసు వారితో కలిసి సామాజిక దురాగతాలకు దూరంగా ఉండమని ప్రజలను చైతన్య పరిచేందుకు “పరివర్తన” అను కార్యక్రమము చేపట్టాలని ఆదేశించడం జరిగినది. ఇకపై నాటుసారా అమ్మిన, తయారుచేసిన వారి పై కేసులు పెట్టి రిమాండ్ కు తరలించాలని తెలిపారు. విశాఖ రురల్ ఎఇఎస్ S. శ్రీనివాస రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అనకాపల్లి ఎస్ఇబి, నర్సీపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ ఏ.సంతోష్,ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు…