గుంటూరు : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మరికొద్దిసేపటిలో ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగనుంది.
ఇందుకోసం విజయవాడ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు రానుంది.ఈఎస్ఐ స్కాంలో ఈనెల 12న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా… అనారోగ్యం కారణంగా 13 తెల్లవారుజామున జీజీహెచ్‌కు తరలించారు. అచ్చెన్నాయుడికి రెండోసారి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.కోర్టు ఆదేశాలతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
ఈ క్రమంలో జీజీహెచ్‌కు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.