నర్సీపట్నం : శుక్రవారం మున్సిపాలిటీలోని 27 వార్డుల లబ్ధిదారుల నుండి వినతిపత్రాలను ఆయా వార్డు కౌన్సిలర్లు సేకరించి ఆర్డీఓకు అందజేశారు.ఈ సందర్భంగా అయ్యన్న యువసేన నాయకులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ టీడీపీ హాయాంలో గ్రూప్ హౌసింగ్ మంజూరు చేసి, నెలవారీ అద్దె మాదిరిగా రూ. 2వేలు చొప్పున 18 సంవత్సరాలు చెల్లించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. అదే సమయంలో నర్సీపట్నం ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన వైయస్ జగన్మోహనరెడ్డి బ్యాంకులు ఇచ్చే రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు మాఫీ పై ఎటువంటి ఆదేశాలు రాలేదని ఆయన విమర్శించారు. దీంతో పాటు ఫ్లాట్ హామీ పేరుతో నెలవారీ రూ.20వేలకు మించి చెల్లించేలా వాలంటర్లు దొంగ సంతకాలు చేయించడం సబబుకాదన్నారు. దీనిపై ఆర్డీవో తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో గ్రూప్ హౌసింగ్ లబ్ధిదారులతో పాటు టీడీపీ నాయకులు పలువురు పాల్లొన్నారు…