న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): జిఎస్‌టి పరిహార తరుగుదలను పూరించేందుకు కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన వ్యయవిభాగం 13వ వారపు వాయిదా కింద రాష్ట్రాలకు 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో, సుమారు 5,516.60 కోట్ల రూపాయలు జిఎస్‌టి కౌన్సిల్ సభ్యులైన 23 రాష్ట్రాలకు, రూ483.40 కోట్ల రూపాయలు లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన 3 కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, పుదుచ్చేరిలకు విడుదల చేసింది. మిగిలిన 5 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జిఎస్‌టి అమలు వల్ల రెవిన్యూలో తేడా లేదు.
ఇప్పటివరకు అంచనా వేసిన మొత్తం జిఎస్‌టి పరిహారం తరుగుదలలో 70 శాతం మొత్తాన్ని రాష్ట్రాలు, లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. ఇందులో 71,099.56 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగింది. 6,900.44 కోట్ల రూపాయలను లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. జిఎస్‌టి అమలు వల్ల తలెత్తగలదని అంచనా వేసిన 1.10 లక్షల కోట్ల రూపాయల రెవిన్యూ తరుగుదలను అవసరాలను తీర్చేందుకు భారత ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ఒక ప్రత్యేక రుణ పరపతి విండో ను ప్రారంభించింది. ఈ రుణాలను ఈ విండో ద్వారా భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున సమీకరిస్తుంది. 2020 అక్టోబర్ 23 నుంచి ఇప్పటివరకు 13 విడతల రుణసేకరణ పూర్తి అయింది. ఈ వారం రాష్ట్రాలకు విడుదల చేసిన ఈ మొత్తం ఈ తరహా 13వ వాయిదా మొత్తం. ఈ వారం రుణం తీసుకున్న మొత్తంపై వడ్డీ 5.3083 శాతంగా ఉంది. ఇప్పటివరకూ రూ 78,000 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ప్రత్యేక రుణ పరపతి విండో ద్వారా సగటు వడ్డీ రేటు 4.7491 శాతం కింద సేకరించింది.
ప్రత్యేక రుణ పరపతి విండో ద్వారా సమీకరించిన నిధులకు తోడు జిఎస్‌టి అమలు వల్ల ఏర్పడిన రెవిన్యూ లోటును పూడ్చేందుకు భారత ప్రభుత్వం అదనపు రుణ పరపతి అనుమతిని ఆయా రాష్ట్రాల జిఎస్‌డిపిలో 0.50 శాతం మొత్తానికి సమానమైన మొత్తానికి, జిఎస్‌టి పరిహార తరుగుదలను పూడ్చేందుకు ఆప్షన్ -1 ని ఎంపిక చేసుకున్న రాష్ట్రాలకు ఇచ్చింది. ఇది అదనపు ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడానికి పనికివస్తుంది. అన్ని రాష్ట్రాలు ఆప్షన్ -1 కింద తమ ప్రిఫెరెన్స్ ఇచ్చాయి. ఈ ప్రొవిజన్ కింద 28 రాష్ట్రాలకు 1,06,830 కోట్ల రూపాయల మేరకు (జిఎస్‌డిపిలో 0.50 శాతం) అదనపు మొత్తం రుణ పరపతికి అనుమతి మంజూరు చేయడం జరిగింది. 28 రాష్ట్రాలకు అదనపు రుణ పరపతి మొత్తానికి అనుమతి, ప్రత్యేక విండో ద్వారా సేకరించిన మొత్తం, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన మొత్తాలను దీనితో జతచేయడం జరిగింది.