గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర భాయ్ పటేల్‌ను ఎంపిక.

గాంధీనగర్,ఐ-హబ్‌: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర భాయ్ పటేల్‌ను ఎంపికచేశారు. విజయ్ రూపానీ రాజీనామా అనంతరం నేడు గాంధీనగర్‌లో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం ఘాట్ లోడియా ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి విజయ్ రూపానీ భూపేంద్ర పేరును ప్రతిపాదించగా నితిన్ పటేల్ సమర్థించారు. మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. 2022లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి…ఈ కార్య‌క్ర‌మానికి ప‌రిశీలికులుగా తోమ‌ర్‌,జోషి విచ్చేసారు. ఈ స‌మావేశంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ త‌దిత‌రులు పాల్గోన్నారు…

Latest News