మన్‌కీబాత్‌ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.


ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

న్యూఢిల్లీ:ఈ ఏడాదిని 2020 చెడ్డదిగా అభివర్ణించొద్దని కోరారు.ఏడాది ఆరంభం నుంచీ ఒక దాన్ని మించి మరొకటి విపత్తులు తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.అంపన్‌ తుపాను,కరోనా, వైరస్‌, లద్దాక్‌లో సరిహద్దు వివాదాలు అన్నింటిపైనా మోదీ స్పందించారు.చైనాతో సరిహద్దు వివాదంపై స్పందిస్తూ డ్రాగన్‌ దేశానికి మన సైనికులు గట్టిగా బుద్ధి చెప్పారని,సైనికుల త్యాగలను దేశం ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని తెలిపారు.సైనికుల శౌర్యమే భారత దేశ బలమని పేర్కొన్నారు.గల్వాన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
సైనికులు ఎల్లవేళలా దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని పేర్కొన్నారు.చైనా నుంచి సరిహద్దులను కాపాడుకుంటున్న భారత్‌ చిత్తశుద్ధిని ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు.డ్రాగన్‌ దేశం దుర్బుద్ధితో సరిహద్దులను ఆక్రమించుకోవాలని చూస్తోందన్నారు.ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ మేకిన్‌ ఇండియాకు మద్దతు తెలుపుతున్నారని, స్థానిక వస్తుసేవలవైపే మొగ్గు చూపుతున్నారని వివరించారు.భారత పురోభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు…

Latest News