న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన నివేదికలను బట్టి ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్‌ఎంఐఎస్)లో పొందుపరిచిన ప్రకారం; 2019 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 1.54 కోట్ల కాన్పులు నమోదయ్యాయి. 2020లో ఇదే కాలానికి 1.33 కాన్పులు నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో కాన్పుల ప్రాముఖ్యత దృష్ట్యా; బాలింతలు, శిశువుల ఆరోగ్యం, రోగనిరోధకత మొదలైన వాటితో సహా ఆరోగ్య సేవలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సజావుగా అందించేలా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది.
కొవిడ్ సమయంలో నిరాటంకంగా సేవలు అందించాల్సిన అవసరాన్ని స్పష్టీకరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతర పర్యవేక్షణ, వీడియో కాన్పరెన్సులు నిర్వహించింది. కొవిడ్ సమయంలో, తర్వాత పునరుత్పత్తి, తల్లి, నవజాత, పిల్లల, కౌమార శిశువుల ఆరోగ్యం, పోషకాహార సేవలు, కొవిడ్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలు ప్రారంభంపై మార్గదర్శకాలను వరుసగా 14 ఏప్రిల్, 2020, 24 మే 2020న రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ పంపింది.