నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకన్య కూడలిలో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు .రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాదె శ్రీనివాసరావు మాట్లాడుతూ లడక్ ప్రాంతంలో చైనా సైనికులు అమానుషంగా దాడి చేయడం ద్వారా భారతీయ వీర సైనికులు 20 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ముఖ్యంగా ఈవీరోచిత పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు మృతి చెందడం విచారకరమన్నారు. అసెంబ్లీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీర సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తూ చైనా అధ్యక్షుడు చిత్ర పటాలను దగ్ధం చేశారు. ఈసందర్భంలో చైనా వస్తువులు వాడటం పూర్తిగా నిషేధించాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బంగారు ఎర్రినాయుడు, గొంప వెంకటేశ్వర యాదవ్ (బాబా), పి.రమణ యాదవ్, కె.వి లక్ష్మి, మల్లేశ్వరి, పృద్వి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…