కార్మికులు పనిచేసే చోట భౌతిక దూరం పాటించాలి.

నర్సీపట్నం : కార్మికులు పనిచేసేచోట భౌతిక దూరం పాటించడం,మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండేటట్లు చూడాలని నర్సీపట్నం ఏ.ఎస్పి తుహిన్ సిన్హా పేర్కొన్నారు.ఈరోజు ఎన్.ఏ.ఓ.బి,స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.ఈ కార్యక్రమంలో శానిటైజర్ లు,సబ్బులు,మాస్కులు అందుబాటులో ఉంచి,కార్మికులకు కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. అనుమానాస్పద వైరస్ లక్షణాలు ఉన్నవారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గాని డైల్ 100 గాని తెలియజేయాలన్నారు.ఈ సమావేశంలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు…

Latest News