న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎంబిజెకె) దేశానికి అత్యవసర సేవలను అందించింది. అన్ని ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రాలు (పిఎంబిజెకె) తమ కార్యకలాపాలను నిత్యం నిర్వహిస్తూ, మందులను పౌరులకు అందుబాటులో ఉంచాయి. పిఎంబిజెకెలకు మందులను/సర్జికల్స్‌ను సరఫరా చేసే అన్ని ఉత్పత్తి కేంద్రాలకూ కోవిడ్ సంబంధిత పరిరక్షణ ప్రోటోకాళ్ళను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర/ స్థానిక యంత్రాంగాలు జారీ చేసిన నిర్దేశాలు/మార్గదర్శకాలను అనుసరించాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా, బ్యూరో ఆఫ్ పార్మా పిఎస్‌యూస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) వేర్‌హౌజ్‌ల, అందించే వస్తువుల శానిటైజేషన్ నిత్యం నిర్వహించడం జరిగింది. అదనంగా, దుకాణాలలో కోవిడ్ సంబంధిత అన్ని పరిరక్షణ ప్రోటోకాల్స్‌ను అనుసరించారు. లాక్‌డౌన్ విధించినప్పటికీ, పిఎంబిజెకీలకు క్రమబద్ధంగా మందులను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రాల (పిఎంబిజెకె)లలో మందులమ్మకాలు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2020-21 మొదటి, 2వ త్రైమాసికాలలో పిఎంబిజెకెలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 60% అధికంగా అమ్మకాలు సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎంబిజెకెలు మొత్తం ఆర్థిక సంవత్సరానికి విధించిన రూ. 500 కోట్ల లక్ష్యానికి వ్యతిరేకంగా 29.01.2021 నాటికి రూ.519.34 కోట్ల విలువైన అమ్మకాలు చేశాయి.