జనసేన ఆధ్వర్యంలో పార్వతీపురం గ్రామంలో 70 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

నాతవరం, కోస్తాటైమ్స్: నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల నాతవరం మండలం చెర్లపాలెం పంచాయితీ పార్వతీపురం గ్రామంలో శనివారం 70 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మరియు కూరగాయలు తన సొంత నిధులతో నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన సూర్యచంద్ర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమలో స్థానిక జనసేన నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి పి.కృపవతి, మండలం పార్టీ అధ్యక్షుడు రాజన్న లోవ కుమార్, మరియు నాయకులు N. నాయుడు, L.రాజా, N.రాజు M.నాగేశ్వరావు, V.రాజన్న గోవిందు, M.శ్రీనివాస్, S.గోవిందా సమక్షంలో కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన కుటుంబాలకు ఆదుకునేందుకు తనవంతు సాయంగా జనసేన పార్టీ ఆపద సమయంలో మేమున్నామని భరోసా కల్పిస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News