కూటమి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు ప్రజల వద్ద సూపర్ హిట్ – అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్

*నర్సీపట్నం నియోజకవర్గంలో 1615 మంది ఆటో డ్రైవర్లుకు లబ్ధి

*కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లో విశ్వాసం నింపింది.

*విద్యా కానుక పథకం ద్వారా ప్రతి విద్యార్థికి మేలు చేకూరుతోంది.

*ఆటో డ్రైవర్ సేవలో పథకం సీఎం చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం అని తెలిపిన

రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్.

 

నర్సీపట్నం: మార్కెట్‌యార్డ్‌లో గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రు ఆధ్వర్యంలో “ఆటో డ్రైవర్‌ల సేవలో” కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర , రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.కార్యక్రమానికి ముందు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్ల ర్యాలీ ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ స్వయంగా ఆటో నడిపి,అందులో స్పీకర్, మంత్రి , జిల్లా కలెక్టర్ ని ఎక్కించుకొని మార్కెట్‌యార్డ్ సభా ప్రాంగణం వరకు తీసుకెళ్లారు. దారి పడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ఘనంగా ర్యాలీ ఘనంగా సాగింది ర్యాలీలో ఆటో యూనియన్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఘనమైన స్వాగతం నేతలకు పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల వద్ద సూపర్ హిట్ అయ్యాయి అన్నారు.గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్య పెట్టారని విమర్శించారు.ప్రస్తుతం ప్రజల ప్రభుత్వం నెలకొని, ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తోందని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు ₹4,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.విద్యా కానుక పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి నేరుగా డబ్బులు చేరుతున్నాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి వల్లే ఆటో డ్రైవర్ సేవలో వంటి పథకాలు వాస్తవ రూపం దాల్చుతున్నాయని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల ఆటో డ్రైవర్లకు, ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ₹436 కోట్లు కేటాయించిందని తెలిపారు.అనకాపల్లి జిల్లాలో సుమారు 15 వేల ఆటో డ్రైవర్లు, నర్సీపట్నం నియోజకవర్గంలో 1615 మంది డ్రైవర్లుకు లబ్ధి పొందుతున్నారని వివరించారు. ఆటో డ్రైవర్ కుటుంబాల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు సభలో హాజరైన వారంతా కరతాళధ్వనుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు.కార్యక్రమంలో కూటమినేతలు, ప్రభుత్వ అధికారులు, ఆటో యూనియన్లు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Latest News