మీటర్ రీడర్లకు ఏప్రిల్ నెల వేతనం చెల్లించాలి.

నర్సీపట్నం,కోస్తాటైమ్స్ : విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మీటర్ రీడర్ల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకొని,రీడర్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ నెల వేతనం చెల్లించాలని,మే నెలలో బిల్లింగ్ చేసే సమయంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డి.ఈ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేసిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బీవీఎస్ అప్పారావు మాట్లాడుతూ ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో మీటర్ రీడర్లుతో మే నెలలో బిల్లింగ్ చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని,అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా సంస్థ కోసం కష్టపడాలని ఉందని,మా ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని,మా సమస్యలు పరిష్కరించాలని కోరారు.లాక్ డౌన్ విధించిన కారణంగా మీటర్ రీడర్లతో అధికారులు ఏప్రిల్ నెలలో బిల్లింగ్ చేయించలేదని,వేతనం వస్తుందో,రాదో తెలియదన్నారు.మానవతా దృక్పథంతో ఆలోచించి అధికారులు చర్యలు తీసుకోవాలని,అలాగే మీటర్ రీడర్లు బిల్లింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు ఆరోగ్యపరమైన భద్రత సౌకర్యాలు కల్పించాలని మాస్కులు, గ్లౌజులు,శానిటైజర్లు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల సౌకర్యాన్ని మీటర్ రీడర్లకు కల్పించాలని డిమాండ్ చేశారు.ఫీల్డ్ కి వెళ్లే సమయంలో పోలీసులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐడెంటి కార్డు జారీ చేయాలని,ఎండ తీవ్రత దృష్ట్యా రోజుకు నాలుగు గంటలు మాత్రమే బిల్లింగ్  చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  నర్సీపట్నం డివిజన్ ప్రెసిడెంట్  ఐ.డి రాజు, కరణం సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Latest News