ఘనంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు

మాకవరపాలెం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ జయంతి వేడుకలను కొండ అగ్రహారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షులు చిందాడ నూకేశ్వరరావు మాదిగ పాల్గొని మంద కృష్ణమాదిగ జన్మదినం,ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల వర్గీకరణకై మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు సామాజిక సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారని తెలిపారు.రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ తధ్యమని తెలియజేశారు.ఎస్సీల భూములపై రాజకీయ నాయకులు,అగ్రవర్ణాలు దౌర్జన్యం ఎక్కువైంది అన్నారు.ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఈకార్యక్రమంలో మాకవరపాలెం మండలం మహిళా అధ్యక్షురాలు చిక్కోలు వరలక్ష్మి మాదిగా, నర్సీపట్నం నియోజకవర్గం నాయకులు చిక్కోలు రాజుబాబు మాదిగ, కోటా నాగమణి, ఎత్తుల వరలక్ష్మి, మంజేటి తబిత,లీలా మాదిగ తదితరులు పాల్గొన్నారు…

Latest News