నర్సీపట్నం : భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, బిజెపి సిద్ధాంత కర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 68 వ వర్ధంతి బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కె.ఎన్.ఆర్. వద్ద నిర్వహించారు.కార్యక్రమంకు ముందుగా డాక్టర్ శ్యాం ప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళ్ళ సుబ్బారావు నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ మాట్లాడుతూ ఈ దేశంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడని పేర్కొన్నారు.1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారన్నారు.స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ. 33 ఏళ్లకే అసాధారణ స్థాయిలో రెండు పర్యాయాలు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్సలర్ అయిన మేధావన్నారు. స్వాతంత్ర వీర సావర్కర్ ప్రభావంతో హిందూ మహాసభలో చేరి రాజ కీయాల్లో అడుగుపెట్టారు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ తొలుత విశ్వవిద్యాలయం తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు. మరుసటి సంవత్సరంలోనే బెంగాల్ శాసనసభను బహిష్కరించాలని భారతీయ జాతీయ కాంగ్రెసు నిర్ణయించడంతో ఆ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. పాకిస్తాన్ ఏర్పాటును కోరుకొనే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించారన్నారు.
ఆర్.ఎస్.ఎస్ ద్వితీయ సర్ సంఘ్‌చాలక్ గురూజీ గోల్వాల్కర్ జీ ప్రేరణతో ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారు. పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలోనే 1952లో జరిగిన ఎన్నికలలో జనసంఘ్ పార్టీ త్రీ లోక్ సభ స్థానాలలో విజయం సాధించగా, అందులో ఒక స్థానం నుంచి ముఖర్జీ విజయం సాధించారు.నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మద్దతు పలికిందని దేశంలో మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలని ఉద్ఘాటించారని.గోహత్య, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమన్నారు. ఈ కారణంతో 1953లో కాశ్మీర్ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి కాశ్మీర్ సరిహద్దు వద్ద మే 11 న అరెస్టు అయ్యారని జూన్ 23, 1953 న కస్టడీలోనే అత్యంత అనుమానా స్పద పరిస్థితుల్లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు వదిలారు.ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి విచారణ జరుపవలసిందిగా కోరిననూ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపలేదు. దేశ చరిత్రలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదమైన అంశంగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు. వారి మరణం వృధా కాలేదని. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోందని తెలిపారు.వారి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 370 ఆర్టికల్ రద్దు చేయడం దేశ ప్రజలు అందరూ కూడా గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు తమరాన ఎర్రన్నాయుడు మాట్లాడుతూ దేశం స్వతంత్రంలో పోరాడిన అగ్రగణ్య మహా నాయకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వం కాశ్మీరుకు స్వాతంత్రం నుండి ఇప్పటివరకు ఉన్న స్వయంప్రతిపత్తి హక్కులను రద్దు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యాడ దేవి, నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకట రమణ యువమోర్చా నాయకులు అడిగర్ల సతీష్, బొలెం శివ,మల్ల పృథ్వీరాజ్,పార్టీ నాయకులు పోలిరెడ్డి. సూరిబాబు,చిట్టిబాబు వేముల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు…