కార్తీకమాసంలో పిక్నిక్‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు.

న‌ర్సీప‌ట్నం-కోస్తాటైమ్స్‌ కార్తీకమాసం సందర్భంగా పిక్నిక్ లకు వెళ్ళేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసామ‌ని, అరుకు, లంబసింగి , వెళ్ళే వారికోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి శని, ఆదివారాలు ఉదయం 3 గంటలకు అరుకు, లంబసింగి ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నామ‌ని తెలిపారు. ఇందులో భాగంగా మన్యంలోని పలు పర్యాటక ప్రదేశాలు చూపిస్తామని తెలిపారు. పెద్దలకు రూ. 700, పిల్లలకు రూ. 500 చొప్పున చార్జీలు వసూళ్లు చేయనున్నట్లు నర్సీపట్నం ఆర్టీసీ అధికారులు తెలిపారు …

Latest News