‘అపోహలను ఎవరూ పట్టించుకోవడం లేదు’

అమరావతి, జనవరి 21 (న్యూస్‌టైమ్): ప‌్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న అపోహాలు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ‘చంద్రబాబు రాజకీయంగా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మతపరమైన విభజన అనే గుక్కెడు నీటితో ప్రాణం నిలుపుకోవచ్చని ఆశపడుతున్నారు. ఆయన అనుకున్నది ఎప్పటికీ నెరవేరదు. సీఎం జగన్ గారి నాయకత్వంలో ప్రజలంతా సమిష్టి శక్తితో ఐకమత్యంగా ఉన్నారు. అపోహలను ఎవరూ పట్టించుకోవడం లేదు.’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘కష్ట పడే వాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. నీ శ్రమకు ఫలితం.. ఆలస్యం అవ్వవచ్చు కానీ.. సమయం వచ్చినపుడు మాత్రం అద్భుతాలు జరగడం ఖాయం.’ అంటూ అంత‌కు ముందు మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Latest News