శ్రీవెంకటేశ్వరస్వామికి భ‌క్తులు ఇచ్చిన ఆస్తులు అమ్మే హక్కు ఎవ‌రికి లేదు – ఎమ్మెల్సీ. పివిఎన్ మాద‌వ్

న‌ర్సీ‌ప‌ట్నం – తిరుమ‌ల శ్రీ వెంకటేశ్వరస్వామి విలువైన ఆస్తులు నిర‌ర్ధ‌క‌మ‌ని పేరుతో అమ్మేవేసే ప్రక్రియ సరియైనదికాదని , స్వామివారికి భ‌క్తులు కైక‌ర్యం ఇచ్చిన ఆస్తులు అమ్మే హక్కు ఎవ‌రికి లేద‌ని ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాద‌వ్ పేర్కోన్నారు. స్ధానిక డిగ్రి కాలేజ్ ద‌గ్గ‌ర గ‌ల రిటైర్డ్ ఎఎస్ఐ క‌ర‌ణం ఈశ్వ‌ర‌రావు స్వ‌గృహంలో విలేఖ‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ సనాతనధర్మం జీవనవిధానం కోసం జీవితాన్ని సైతం ఫణంగా పెట్టైనా పోరాడుతామన్నారు. తిరుమ‌ల వెంకటేశ్వరస్వామి, వివిధ దేవాల‌యాల విలువైన ఆస్తులు విష‌యంలో రాష్ట్ర బిజెపి పోరాటానికి సిద్ద‌‌మ‌న్నారు. కరోనా సంబంధించి ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరించిన తీరు బాధాకర‌మ‌ని తెలిపారు. ఇటువంటి సమయంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోవ‌డం నిజంగా దౌర్భాగ్యమ‌న్నారు. బిజెపి జనసేన కలయిక భవిష్యత్తు కాలానికి ప్రజలకు చాలా అవసరమని ప్రజలు భావిస్తున్నార‌ని తెలియజేశారు. ప్ర‌పంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న ద‌శ‌లో భార‌త‌దేశం ఒక దిక్సూచిగా చూపిన ఘ‌న‌త న‌రేంద్ర మోడిదే అని అన్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం  ప్రకటించిన 20లక్షలకోట్లు ప్యాకేజీ ఉచిత పంపిణీ కోసమే కాదని, భవిష్యత్తు తరాల బాగుకోసం స్వదేశీ విధానం తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు.స్వదేశీ తయారీ ద్వారా దేశం ఆర్ధిక స్వావ‌లంబ‌న సాధించేదుకు నిరంత‌రం తపిస్తూ ప్రపంచంలోని మొదటి స్థానానికి ఎదిగే స్థాయిలో ఉండాల‌ని ప్రియ‌త‌మ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఆలోచ‌న చేయ‌డం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని భావించిన వ్యక్తి మోడీనే న‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జిల్లాఅధ్యక్షులు కురసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు గాదే శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లాఅధ్యక్షులు. బంగారు ఎర్రినాయుడు,పాడేరు అసెంబ్లీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా రాజారావు, చల్లా రామకృష్ణ,రుత్తుల గోపీ తదితరులు పాల్గొన్నారు.

Latest News