న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): భారతదేశంలో కోవిడ్ తో బాధపడుతూ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 1,41,511కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 1.30%. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణికి అనుగుణంగా 33 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నది 5,000 లోపు మాత్రమే. డామన్, డయ్యూ, దాద్రా, నాగర్ హవేలిలో ఒక్క కేసు కూడా లేదు.
గత 24 గంటలలో 11,067 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 13,087 మంది కోలుకున్నారు. దీనివలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 2,114 కేసులు తగ్గాయి. రెండు రాష్ట్రాలకు (కేరళ, మహారాష్ట్ర) మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 71% వాటా ఉంది. గత 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, మణిపూర్, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, సిక్కిం, అండమాన్, నికోబార్ దీవులు, లద్దాఖ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేలి భారతదేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,05,61,608 కాగా, కోలుకున్నవారి శాతం 97.27%.
2021 ఫిబ్రవరి 10 ఉదయం 8గంటలకు 66,11,561 మంది కోవిడ్ టీకాలు అందుకున్నారు. ఇప్పటివరకు మొత్తం టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 66,11,561 కాగా, వారిలో 56,10,134 మంది ఆరోగ్య సిబ్బంది, 10,01,427 మంది కరోనా యోధులు ఉన్నారు. ఇప్పటివరకు 1,34,746 శిబిరాలు నిర్వహించారు. 25వ రోజైన ఫిబ్రవరి 9న దేశవ్యాప్తంగా 3,52,553 మంది టీకాలు తీసుకున్నారు. వారిలో ఆరోగ్య సిబ్బంది 1,28,032 కాగా, కరోనా యోధులు వస్తోందిగా 2,24,521మంది. వీరికోసం నడిపిన శిబిరాలు 7,990. రోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
కొత్తగా కోలుకున్నవారిలో 81.68% మంది కేవలం 6 రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా ఒకే రోజు 6,475 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 2,554 మంది, కర్నాటకలో 513 మంది కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ నిర్థారణ అయినవారిలో 83.31% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా 5,214 కేసులు రాగా, మహారాష్ట్రలో 2,515 మంది, తమిళనాడులో 469 మంది పాజిటివ్‌గా తేలారు. గత 24 గంటలలో 94 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఆరు రాష్ట్రాల్లోనే 80.85% మరణాలు నమోదయ్యాయి.. అత్యధికంగా మహారాష్ట్రలో 35 మంది, ఆ తరువాత కేరళలో 19 మంది, పంజాబ్‌లో 8 మంది చనిపోయారు.