పాడి రైతులకు 90% రాయితీతో గోకులం షెడ్లు

100 % రాయతీ తో పశుగ్రాస క్షేత్రలు డంగ్ ట్యాంక్లు.

టీకాలను,నట్టల నివారణకు మందులు సిద్ధం.

నాతవరం : రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంలో పెయ్య దూడల ఉత్పత్తి పధకం-లింగ నిర్ధారణ వీర్యంతో 90 శాతం ఆడ దూడల జననం (సెక్స్ సర్టెడ్ సెమిన్ ).రాయితీ పై రూ.500 కు రెండు పర్యాయలు కృత్రిమ గర్భధారణ వీర్యంను పాడి పశువులకు అందుబాటులో డా. పెట్ల నరేష్ ఉంచామన్నారు. రాయితీపై పశు భీమా పథకంలో పశువులుకు, గొర్రెలు మరియు మేకలకు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నదన్నారు. 3.75% రాయితీపై పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో పాడి రైతులకు 90% రాయితీతో గోకులం షెడ్స్, 100 % రాయతీ తో పశుగ్రాస క్షేత్రలు డంగ్ ట్యాంక్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ నెలలో పశువులకు గాలికుంటు వ్యాధి,బృసెల్లోసిస్,ముద్దచర్మ వ్యాదికి వ్యాధినిరోధక టీకాలు ను 100% పశువులకు చేయటానికి ప్రణాళికను సిద్ధం చేసామన్నారు. అదేవిధంగా గా గొర్రెలు,మేకలుకు పి.పి.ఆర్, నీలి నాలుక టీకాలను,నట్టల నివారణకు మందులను వేయటానికి ప్రణాళికను సిద్ధం చేసామన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కొరకు రైతులనుండి దరఖాస్తులను సేకరించి బ్యాంకులకు అందజేస్తున్నమన్నారు…

Latest News