నర్సీపట్నం : రాజ్యాంగ నిర్మాత నిమ్న కులాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివసించిన రాజ్ గృహంపై దాడి చేసిన వారిపై దేశద్రోహ,ఎస్సీ,ఎస్టీ చట్టములపై శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు చిందాడ నూకేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు.తేది:15-07- 2020 న అనగా బుధవారం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్ధాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు స్థానిక ఆబీద్ సెంటరులో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ గృహం ధ్వంసముపై దేశద్రోహ,ఎస్సీ,ఎస్టీ కేసులను నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించి దాడులకు పాల్పడిన వారిపై కఠిచర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ కుటుంబీకులకు జాతీయ, రాష్ట్ర భద్రతా దళాలతో పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు రాము మాదిగ, మహిళా విభాగం ఇట్లు లోవ మాదిగ,వెంకటలక్ష్మి మాదిగ తదితరులు పాల్గొన్నారు…