విజయవాడ, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): కృష్ణా జిల్లా నందిగామ డీయస్పీ నాగేశ్వర రెడ్డి ఆదేశాలతో సీఐ చంద్ర శేఖర్ పర్యవేక్షణలో వారంలో దొంగతనం కేసు ఛేదించిన జగ్గయ్యపేట ఎస్సై చినబాబు. జగ్గయ్యపేటలో వారం రోజుల క్రితం హైదరాబాద్ రోడ్డులో ఎస్బిఐ బ్యాంక్ పక్కన రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న మహిళ మెడలో గొలుసు లాక్కొని బైకుపై వుండాయుంచిన ఇద్దరు కేటుగాళ్లు వారం రోజుల వ్యవధిలోనే సీసీ కెమెరాల సహాయంతో కేసును చేధించి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా మరో నాల్గు దొంగతనాలు చేసిన విషయం బయటపడింది.
జగ్గయ్యపేటలో రెండు నేరాలు, తెలంగాణ కోదాడలో మూడు నేరాలకు పాల్పడినట్లు పోలీసులకు వెల్లడించిన కేటుగాళ్లు. జగ్గయ్యపేట, కోదాడకు చెందిన నల్గురు మహిళలో లాక్కెళ్లిన 44 గ్రాముల బంగారు గొలుసులు, కోదాడలో ఓ మొబైల్ షాప్లో చోరీ చేసిన రెండు మొబైల్ ఫోన్లు, దొంగతనానికి వాడిన బైకును స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు. ఎమ్టెక్, డిగ్రీ చదివి చెడు వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం దొంగతనాల బాట పట్టిన అనిల్, నాని ఇద్దర్ని జైలు బాట పట్టించారు ఖాకీలు. జగ్గయ్యపేట ఏస్సై చినబాబుకు, సీసీ కెమెరా టెక్నీషియన్లు విష్ణు, సుధీర్లకు రివర్డులు అందజేశారు డీయస్పీ నాగేశ్వర రెడ్డి.