వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్..
విశాఖపట్నం, జనవరి 21 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పనిచేస్తున్నారన్నారు. విశాఖలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం కోరుతున్నా నిమ్మగడ్డ వినిపించుకోవడం లేదని, ప్రజారోగ్యాన్ని కూడా నిమ్మగడ్డ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైయస్‌ఆర్‌సీపీ అద్బుతమైన విజయాన్ని సాధిస్తుందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని మాత్రమే కోరుతున్నామన్నారు.