నర్సీపట్నం: మండల సమరసత సేవా ఫౌండేషన్ (SSF) కన్వీనర్ గా పాకలపాటి అరవింద్ కుమార్ ను నియమించడం జరిగింది. స్థానిక శారదనగర్ లో జరిగిన మండల సమావేశంలో డివిజన్ ధర్మ ప్రచారక్ నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ హిందూధర్మ రక్షణలో భాగంగా ముందుకు వచ్చిన అరవింద్ కుమార్ కు హృదయ పూర్వక అభనందనలు తెలిపారు. మత మార్పిడులను నిరోధించేందుకు,ధర్మాన్ని ప్రచారం చేసేందుకు మండలంలోని దేవాలయాల మాధ్యమంగా గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ మండల కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలను సమాయత్తం చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మండల ధర్మప్రచారక్ వరహాలరావు తదితరులు పాల్గొన్నారు…