న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): సర్జన్ రియర్ అడ్మిరల్ ఆర్తి సారిన్ ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్ (ఐఎన్‌హెచ్‌ఎస్) అశ్విని కమాండ్ బాధ్యతలను స్వీకరించారు. సర్జన్ రియర్ అడ్మిరల్ షీలా ఎస్ మథాయ్ నుంచి ఇండియన్ నేవీ ప్రధాన ఆసుపత్రి అయిన ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్విని కమాండ్ బాధ్యతలను ఆర్తి చేపట్టారు.
సర్జన్ రియర్ అడ్మిరల్ షీలా ఎస్ మథాయ్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (డబ్ల్యూఎన్‌సీ) హెడ్ క్వార్టర్స్ కమాండ్ మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరి నియామకం భారతీయ నావికాదళంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అనేక మంది ఆర్మీ, నేవీ అధికారుల సమక్షంలో ఈ ఇద్దరు మహిళా అధికారులు పరస్పర కరచాలనం ద్వారా బాధ్యతలు చేపట్టారు.