విజయవాడ, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్): మేయర్ పీఠాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు.
55వ డివిజన్ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అర్షద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.