ఒంగోలు,మే-20 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)వింజమూరు శాఖ ఆధ్వర్యంలో పత్రిక విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేయడం జరిగినది.ఈ సమావేశం లో ABVP రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌశిక్ మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న బోధన,బోధనేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపారు.
డిమాండ్స్:
1. అన్ని రకాల ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే బోధన బోధనేతర సిబ్బందికి లాక్ డౌన్ కాలానికి వెంటనే వారి మాతృ సంస్థలు జీతాలు తక్షణమే చెల్లించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
2 .టీచర్ల వేతనాలకు సంబంధించిన సమస్యలపై జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలి.
3. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే బోధన బోధనేతర సిబ్బందికి ఉచిత ఆరోగ్య బీమా ఏర్పాటు చేయాలి.
4.మహిళా సిబ్బంది కి మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును ప్రకటించాలి.
5. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించి సదరు యాజమాన్యాల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలి.
6.ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే వారి కోసం ఆదుకోవడానికి 100 కోట్లతో కార్పస్ ఫండ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.