వై.ఎస్.ఆర్.నేతన్ననేస్తం ఒక మంచి కార్య‌క్ర‌మం – రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

విశాఖపట్నం/ఆగష్టు10: రాష్ట్రం లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం సొంత మగ్గం కలిగి ఉండి దానిపై జీవనోపాధి పొందుతున్నలబ్ధి దారులకు ఆర్థిక చేయూత “వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం” పథకం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.మూడ‌వ విడత వైఎస్ ఆర్ నేతన్న నేస్తంలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులయి ఉండి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే సంబంధిత వాలంటీర్లు, గ్రామ సచివాలయం లో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట కాలంలో వారికి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ డా. ఏ మల్లికార్జున మాట్లాడుతూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులు 254 మంది ఉన్నారని,కుటుంబానికి రూ 24,000/- చొప్పున మొత్తం రూ 60,96,000/-నగదును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేనేత కార్మికుల సంక్షేమం కోసం తన పాదయాత్రలో ఇచ్చిన మాటను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు కులమతాలు, పార్టీల కతీతంగా వివక్షత లేకుండా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అర్హులందరికి ఆర్ధిక చేయూత నిస్తున్నారన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాజంలో అందరిని ముందుకు తీసుకు వెళుతూ చిత్తశుద్దితో ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పని చేస్తున్నారన్నారు.ఈ సందర్భంగా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులకు రూ 60,96,000/- చెక్కును అందజేసారు.
వీడియో కాన్పరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు,శాసన సభ్యులు గుడివాడ అమర్ నాద్,నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు నేతన్ననేస్తం లబ్దిదారులు హాజరైయారు.
లబ్దిదారుల స్పందన
మాకుటుంబాలలో వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం విశేష సంతోషాన్ని తీసుకు వచ్చింది.
– గోరు వీర నాగేశ్వరరావు
కరోనా కష్టకాలంలో మమ్ములను జగనన్న ఆదు కున్నారు.
– ఆది నాగ సత్యన్నారాయణ

Latest News