ఆంధ్రప్రదేశ్న్యూస్రాజకీయంరాష్ట్రీయం

అల్లూరి స్ఫూర్తితో గిరిజనుల సేవలకు పునరంకితం – రాష్ట్ర బిజెపి కార్యదర్శి పివియన్ మాధవ్.

కొయ్యూరు, కోస్తాటైమ్స్ (మే -7) : గిరిజన సామాజిక, ఆర్థిక పరిస్థితులను గమనించి, గిరిజన సంక్షేమమే ధ్యేయంగా, గిరిజనులకు విప్లవాత్మక బోధనలు చేసి,యుద్ధ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ వారిపై సమర శంఖం పూరించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు మనందరి స్ఫూర్తిదాయకమని,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఎమ్మెల్సీ పి. వి.ఎన్ మాధవ్ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని పురస్కరించుకొని,ఆదివారం కొండ గోకిరి గ్రామం నుండి, మంప వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంప,రాజేంద్రపాలెం పార్కులలో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మంప,అల్లూరి పార్కు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,అల్లూరిని బ్రిటిష్ వారు నడయాడే దేవుడిగా, గుర్తించారని, భయంతో రాత్రి సమయంల, మధ్య దారిలో దహన క్రియలు జరిపారని, అల్లూరి సహచరులుగా బ్రిటిష్ వారితో పోరాడిన 14 మంది గిరిజన ప్రాంత వాసుల విగ్రహాలను మంప, రాజేంద్రపాలెం పార్కులలో, ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన వరం, 516 నేషనల్ హైవే అని, 4 వందల కిలోమీటర్ల నేషనల్ హైవే తో ఈ ప్రాంతం ముడి పడిందని, గిరిజన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని,జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా రాజేంద్రపాలెం,మంప అల్లూరి పార్కులను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాజేంద్రపాలెం, కేడీపేట అనుసంధానంగా అంబసింగిలో విప్లవ వీరుల మ్యూజియం 65 కోట్ల చేయూత ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. తదనంతరం రాజేంద్రపాలెం అల్లూరి పార్క్ లోని సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రపాలెం అల్లూరు పార్కులో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాజేంద్రపాలెం అల్లూరి పార్క్ లో 14 మంది విప్లవ వీరుల విగ్రహాలను ఏర్పాటుచేసి ,వారి చరిత్రను గోడలపై లిఖిత పూర్వకంగా తెలియజేస్తామన్నారు. గతంలో సుభి రామరెడ్డి పది లక్షల రూపాయలు,సురేంద్ర ప్రభు ఎంపీ గా కోటి రూపాయలు,గతంలో రాజేంద్రపాలెం అల్లూరు పార్కు అభివృద్ధి పనులకు మంజూరు చేసినప్పటికీ, అభివృద్ధికి సరిపోలేదని,50 లక్షలతో త్వరలో అభివృద్ధి పనులు, విగ్రహాల ఆవిష్కరణ ప్రారంభిస్తామని,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యువమొర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు,అల్లూరి జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు,జిల్లా పార్టీ ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి, నర్సీపట్నం అసెంబ్లీ ఇన్చార్జి కాళ్ళ సుబ్బారావు, గాదే శ్రీనివాస్, నర్సీపట్నం పట్టణ అధ్యక్షులు వెలగా జగన్నాథ్ కొయ్యూరు మండల ప్రెసిడెంట్ అప్పలరాజు, అల్లూరి జిల్లా నాయకులు లోకుల కిరణ్, మురళి,రాఘవేంద్ర, రిమల చంద్ర,తంగుల సత్యవతి, స్వప్న కుమారి, అరిమెల రాజు, సంపర శివకుమార్, మర్రి అర్జున్, మంగ తల్లి,అన్నపూర్ణ, భీమాయమ్మ, దాసరి ప్రసాద్, కుర్రు త్రినాథ్, తదితర బిజెపి కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.