నేరాలు .. ఘోరాలురాష్ట్రీయం

ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు.

అమరావతి : ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుందని కొందరు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబరు, ఓటీపీ అడుగుతారని, అలాంటి వారికి వివరాలు చెబితే మోసపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇలాంటివే కొన్ని ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తున్నాయని, వాటితో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఎలాంటి సంబంధంలేదని డాక్టర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు..