జాతీయంన్యూస్రాజకీయంరాష్ట్రీయం

ఉపరాష్ట్రప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ విజ‌యం

* ఈ నెల 11న భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు.

 *  ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 725

 * జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ కు పోలైన ఓట్లు 528

 *  విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్డికి కేవ‌లం 182 ఓట్లు

* 364 ఓట్ల‌ తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన ధ‌న్‌క‌డ్

ఈ రోజు జరిగిన ఉపరాష్ట్రప‌తి ఎన్నికలలో ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ ఘన విజయం సాధించారు.త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి,విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాపై ఆయ‌న 364 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీఏ కూటమి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన‌ జ‌గదీప్ విజ‌యం సాధించారు.

శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు పార్ల‌మెంటు వేదిక‌గా మొద‌లైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల దాకా కొన‌సాగింది. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఎన్నిక‌ల సంఘం అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. కేవ‌లం 3 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.

మొత్తం 725 ఓట్లు పోల‌వ‌గా… జ‌గ‌దీప్‌కు 528 ఓట్లు రాగా… మార్గ‌రెట్ ఆల్వాకు కేవ‌లం 182 మాత్ర‌మే వ‌చ్చాయి. ఇంకో 15 చెల్ల‌నివిగా తేలాయి. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే జ‌గ‌దీప్ విజ‌యం సాధించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నెల 10న వెంక‌య్య నాయుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌గా… ఆ మ‌రునాడు అంటే ఈ నెల 11న జ‌గ‌దీప్ 14 వ‌ భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు…