గొలుగొండ : అక్రమంగా తరలిస్తున్న 120కేజిల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.దీని విలువ 5లక్షలు ఉంటుదని ఎస్సై ఉమామహేశ్వరరావు పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటిగైరంపేట వద్ద ఉదయం 7.30 గంటలకు పట్టుకున్నామని తెలిపారు.పట్టుబడ్డ ఈ గంజాయి ఆటోలో ఏజెన్సీ నుండి నర్సీపట్నం తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.పోలీసులు చేసిన తనిఖీలలో ఆటో నుండి ఇద్దరు తప్పించుకోగా 5గురు పట్టుపడ్డారని తెలిపారు.వీరి నుండి 6 సెల్‌పోన్లు,16వేల 280రూ..లు నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు.పట్టుబడ్డ నిందుతులలో పాడేరుకు చెందిన షేక్ నోనిషా,కె.విజయ్‌కాంత్ ,నీలంపేటకు చెందిన లాలం గణేష్,అప్పలనాయుడు, నర్సీపట్నంకు చెందిన సి.హెచ్ లీలాకృష్ణలపై కేసును నమోదు చేసి విశాఖపట్నం రిమాండ్ కు తరలించామని,పారిపోయిన ఇద్దరు నిందుతులను గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.