ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాజకీయంవిశాఖపట్నం

తుమ్మపాల ఆనకట్టు 2500 ఎకరాల రైతులకు తక్షణమే నీరు అందించాలి.

*ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరి సాగు రైతుకు శాపంగా మారింది.

అనకాపల్లి,కోస్తాటైమ్స్ భ్యూరో (జూలై -30) : తుమ్మపాల ఆనకట్టు ఆయకట్టు పంట కాలువ పూడిక పనులను కొత్త గేట్లు ఏర్పాటు చేసి వెంటనే నారుమల్లు, పొలాలకు తడిపేందుకు వరి నాట్లు వేసేందుకు సాగునీరు వెంటనే అందించాలని పిఎం కిసాన్ జిల్లా కన్వీనర్ పీలా మురళి డిమాండ్ చేశారు…స్థానిక అనకాపల్లి అసెంబ్లీ అనకాపల్లి మండలం తుమ్మపాల ఆనకట్టు ద్వారా ఆయకట్ట రైతులు సుమారుగా 2500 ఎకరాల భూమి బవులువాడ,తుమ్మపాల,మార్టూరు,శంకరం,రేబాక ఐదు గ్రామాలకు సంబంధించిన రైతు పొలాలకు సాగు అందించే ప్రధాన కాలువ దిబ్బపాలెం వద్ద ఉన్నది ఈ కాలవకుండా పోయే నాలుగ ఉపకాలువలు ఉన్నాయి. దిబ్బపాలెం వద్ద ఉన్న శారదా నది అవుట్ గోయింగ్ తలుపులు లేదా గేట్లు చిల్లులు పడిపోయి నీరు వృధాగా పోవడం వల్ల ప్రధాన కాలవకుండా మాటూరు కాలవ దీపాలకాలవ,నడిమికాలవ, ఓర్వకాలవ ఈ ప్రధాన ఉపకాలవుల గుండా పోయేటువంటి నీటి సామర్థ్యం తగ్గిపోయి రైతుకు సాగునీరు అవసరమయ్యే జులై నారుమడులు తడిపేందుకు ఆగస్టు మొదటి వారంలో వరి నాట్లు వేసేందుకు అవసరమైన సాగునీరు అత్యవసరైన సమయంలో కూడా నీరు అందలేని పరిస్థితి …శారదా నదిలో నీరు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పంట కాలువల సాగునీరు అందించేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వలన నేటి కొత్త గేట్లను ఏర్పాటు చేయకపోవడం … పంట కాలవకుండా పూడికలు,తుప్పలు తీయకపోవడం వలన ..సాగునీరు పారుదల తగ్గిపోవడం ప్రధాన కాలువ గేట్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వలన… ఇరిగేషన్ అధికారులు సాగునీరు పారుదల కోసం కాలువలు మీద నిర్వహణ కోసం ఇరిగేషన్ లస్కర్ గాని సంబంధించిన సిబ్బంది ఎవరు నియమించలేదు కేవలం ఇరిగేషన్ అధికారులు తమకు ఎందుకులే నిర్లక్ష్యంగా వదిలేశారు…అవసరమైన వరి నాట్లు వేసే సమయంలో ఈ ఐదు గ్రామాల 2500 ఎకరాల పంట భూమి కూడా పండించేందుకు కావలసిన నీటి వసతి నేటికీ కూడా కల్పించకపోవడం చాలా దురదృష్టకర విషయం…అధికారం నిర్లక్ష్యం కనబడుతుంది..గత నాలుగు సంవత్సరాల కూడా ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదన పంపించాము ప్రభుత్వ నుంచి నిధులు రాలేదు…వస్తేనే మేము చేస్తాం..అన్నట్టుగా చెబుతున్నారు.. మరి నిధులు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అధికారులు ఈ యొక్క ఇరిగేషన్ తలుపులు గాని మెయింటినెన్స్ కాలవలో పూడికలు తీయడం గాని చేస్తారో అర్థం కాని పరిస్థితి…రైతుల్ని పంటను వేసుకున్నప్పుడు కూడా సాగు అందించలేని పరిస్థితి తుమ్మపాల ఆనకట్టు మీద ఆధారపడి ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తగు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ ఇంజనీర్ అధికారులకు తెలియజేస్తూ ఈ యొక్క సమస్యను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే ప్రజాప్రతినిధులు అన్ని చర్య తీసుకుని నిధులు మంజూరు చేసి రైతులకు సాగు నీరు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తూన్నారు…