జిల్లాలు

నర్సీపట్నంలో వికసిత భారత్ సంకల్పయాత్ర

 

నర్సీపట్నం,కోస్తాటైమ్స్, (జనవరి -17) : నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఆధ్వర్యంలో భారత్ సంకల్పయాత్ర,వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు, బోలెం శివ ఆహుతులందరితో వికసిత భారత్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ,భారత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణను ఆయన వివరించారు. నర్సీపట్నం బిజెపి సీనియర్ నాయకులు కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి అన్ని పథకాలు అందాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని,అందులో భాగంగా మహిళలకు ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్,స్టవ్,
తదితర ప్రయోజనాలను అందిస్తుందన్నారు. నిరుద్యోగులకు 38 శాతం సబ్సిడీతో పియం ఆవాస్ యోజన ద్వారా ప్రతి పేదవాడికి పక్కా గృహాలు,బాలికల సమృద్ధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం,ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడికి ఆరోగ్యం,వృద్ధులకు అటల్ పెన్షన్ యోజన ద్వారా పెన్షన్లు తదితర పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు.అనంతరం కేంద్ర ప్రభుత్వ క్యాలెండర్ను విడుదల చేసి అందరికీ అందజేశారు. డిజిటల్ స్క్రీన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను దృశ్య రూపంలో వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చిందాడ నూకేశ్వరరావు,ఎన్విఎస్ నారాయణ,వైద్యాధికారులు చాందిని, దివ్యశ్రీ,హెచ్విడబ్ల్యూ నారాయణమ్మ,టి.అన్నపూర్ణేశ్వరి తదితరులు పాల్గొన్నారు…