ఆహారంజిల్లాలు

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా 60 మందికి ఉజ్వల స్కీం లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ.

నాతవరం, కోస్తాటైమ్స్ : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మంజూరైన 290 మంది ఇండియన్ గ్యాస్ లబ్ధిదారులకు కరోనా వైరస్ ప్రభావం వలన లాక్ డోన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 763 రూపాయలు సబ్సిడీ ఈనెల 9వ తేదీన వేయడం జరిగిందని మండల బిజెపి పార్టీ అధ్యక్షులు లాలం వెంకటరమణారావు తెలియజేశారు. సోమవారం ఆయన నాతవరం లో గల నవ్య ఇండియన్ గ్యాస్ గొడాం దగ్గర 60 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి సబ్సిడీ వేయడం జరిగిందని, వారి ఖాతాలో ఉన్న నగదు తీసుకుని బాండు, బుక్కు, ఆధార్ కార్డు తీసుకొని నవ్య ఇండియన్ గ్యాస్ డీలర్ ను సంప్రదించాలని అన్నారు. అంతేకాకుండా తమ మొబైల్ నంబర్ను ఆధార్ లింక్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు‌. ఏప్రిల్ 30 లోపు ఈ సబ్సిడీ ఉపయోగించ లేనియెడల మే, జూన్ నెలలో ఉచిత గ్యాస్ పొందలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఓబిసి కార్యదర్శి విక్రమ్, జనసేన నాయకులు గుడివాడ కృష్ణ పాల్గొన్నారు.