ఆంధ్రప్రదేశ్న్యూస్మ‌న ఆరోగ్యంవిశాఖపట్నంసేవాఫదం

ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారిగా ఐ.సుధాకర్ నియామకం.

నర్సీపట్నం/కోస్తాటైమ్స్: ఫుడ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు సంచై ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సౌజన్యంతో ఐ. సుధాకర్ ను  ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు, ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ , సుమారు 165 మంది సూపర్వైజర్లును నియమించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ప్రతి పట్టణం, గ్రామాలలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యాపారస్తులకు ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణ, అన్ని రకముల జాగ్రత్తలు మొదలగు సూచనలపై వారికి శిక్షణ ఇప్పించి కేంధ్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. తద్వారా వ్యాపారస్తులు ప్రభుత్వం నుండి రుణాలు మరియు సబ్సిడీ లోన్లు పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు…