రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.

న్యూడిల్లీ: ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు.ఈ మేరకు ఆయన ఈ రోజొక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ చైర్మన్‌ కూడా అయిన నఖ్వి ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు,ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు.స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయిని తెలిపారు.ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని వారు తనకుహామీ ఇచ్చినట్లు తెలిపారు.కరోనా సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు,సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు,స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరాననీ, వారితో స్వయంగా  మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు.

Latest News