ఆహారంస్థానికం

స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వాణ‌కు సిద్ధం.రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్‌.ర‌మేష్‌కుమార్‌

విజయవాడ: ప‌ద‌మూడు జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీ లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ నీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సమావేశానికి హజరైన చీఫ్ సెక్రెటరీ నీలం సహనీ,డీజీపీ గౌతం సనాంగ్,ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం సర్వ సన్నద్ధం గా ఉండాల‌న్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సామర్థ్యం ఉందిని పేర్కోన్నారు .ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి కోరారు.పది అంశాలతో కూడిన చెక్ లిస్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి.స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ను సున్నితమైన అంశంగా పరిగణించి, తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాల‌ని ఆదేశాలు జారీచేసారు.